కాకరేపిన చిరంజీవి-నగ్మా డీల్ లిప్ లాక్ వెన‌క ఇంత జ‌రిగిందా..!

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికున్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయన డేట్స్ కోసం నిర్మాతలు పడిగాపులు కాసేవారు. ఇక హీరోయిన్లయితే ఆయనతో సినిమాలు చేయడానికి కలలు కాసేవారు. ఆ లిస్టులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ నగ్మా కూడా ఉండేదట. సరిగ్గా ఆమె కన్న కల నెరవేరిందంట. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు – చిరు కాంబినేషన్‌ గురించి తెలిసినదే. వారి కాంబినేషన్లో ఘరాన మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలు ఎలాంటి ప్రభంజనాలు సృష్టించాయి వేరే చెప్పనవసరం లేదు.

రాఘవేంద్రరావు నగ్మాను అక్కడ కలుసుకున్నాడట.. ?
అయితే ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్‌గా నగ్మా నటించిన సంగతి విదితమే. అయితే అప్పటికే అమ్మడు కన్నడ, భోజ్‌పురి సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉందట. అలాగే పలు తెలుగు సినిమాల్లో కూడా బిజీగా ఉందట. ఆ సమయంలో సుమన్ సరసన చిన్నల్లుడు సినిమా చేస్తున్న సమయంలో నగ్మా గురించి తెలుసుకున్న రాఘవేంద్ర రావు ఏకంగా ఆమె కోసం సెట్‌కే వెళ్ళిపోయారట.

అక్కడ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. వెంటనే నగ్మాను తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని డిసైడయ్యాడు మన డైరెక్టర్. ఇంత బిజీలో కూడా చిరంజీవి పక్కన ఛాన్స్ అంటే ఎవరు వదిలిపెదతారు?
చిరు సరసన అనగానే నగ్మా ఎగిరి గంతేసిందట. అయితే కాస్త డేట్స్ విషయంలోనే సందిగ్దత నెలకొందట. దాంతో చిరు – రాఘవేంద్రరావు యేవో జిమ్ముక్కులు చేసి సినిమా షురూ చేసారు. ఇక సినిమాలో చిరంజీవి – నగ్మాల మధ్య ఒక లిప్ లాక్ పెట్టాలని దర్శకేంద్రుడు బాగా ఫిక్సైయ్యాడట.

కానీ, అందుకు నగ్మా కాస్త అసహనం వ్యక్తం చేసిందట. అయినా పక్కన చిరంజీవి కదా. అలా వద్దు, అన్న ముద్దు సీన్లో అమ్మడు లీనమైపోయి నటించిందంట. అయితే, నగ్మా ఇబ్బందిని గమనించి సీన్ తీసినా కూడా సినిమాలో లేకుండా ఫైనల్ కట్‌లో తీసేశారని తాజాగ ఓ మీడియా వేదికలో సందర్భాన్ని కొద్దీ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చాడట!