విష్ణుప్రియ అందాల ఆర‌బోత హ‌ద్దులు మీరిందిగా.. అబ్బో పెద్ద ప్లానే వేసిందిగా..!

ఈ మధ్య మన తెలుగు యాంకర్స్ ఓ పక్క యాంకరింగ్ రంగంలో రాణిస్తూనే, సినిమా అవకాశాల కోసం గాలం వేస్తున్నారు. ఇప్పటికే యాంకర్స్ అనసూయ, రష్మీ పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసినదే. అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఆమధ్య ఓ సినిమాతో అరంగేట్రం చేసిన సంగతి విదితమే.

ఇకపోతే ఇటీవల ఓ యాంకర్ రెచ్చిపోయి అందాల ఆరబోతని స్టార్ట్ చేసింది. అదేనండి పలురకాల ఫోటో షూట్స్ లో పాల్గొని తన ప్రతాపాన్ని చూపుతుంది. ఆమె పేరే విష్ణుప్రియ భీమనేని. అవును.. తాజాగా ఆమె హాట్ ఫొటో షూట్లను చేస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ టాప్‌తో భారీ అందాల ప్రదర్శన చేసింది.

ఫోటో షూట్స్ అందుకేనా..?
సదరు ఫోటో షూట్స్ ఇందుకోసమే తెలుసా? సినిమాలలో ఆఫర్లు చెరపట్టాలనే ఉద్దేశంతోనే విష్ణుప్రియ అలా రెచ్చిపోయి షూట్స్ ఇచ్చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఫోటో షూట్స్ చూసినట్లయితే మనకి కూడా అదే అనుమానం కలగక మానదు. ఓ షూట్‌లో అయితే.. విష్ణుప్రియ కేవలం బ్రా మాత్రమే ధరించి కుర్రాళ్ల గుండెల్లో చిచ్చు పెడుతోంది. ఇక అమ్మడు ఘాటు ఫోజులకు మన కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అయినట్టు సమాచారం. ఏదిఏమైనా విష్ణుప్రియ హాట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

విష్ణుప్రియ నేపధ్యం ఇదే:
బుల్లితెర పై ఇప్పుడున్న కొత్త యాంకర్లలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ యాంకర్‌ విష్ణు ప్రియ ఒకరు. అయితే ఈమె యాంకర్ గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోక ముందే.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది విష్ణు ప్రియ. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయో, లేవో తెలియని పరిస్థితి. మొదట ఈమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల మీద మక్కువతో మరలా ఆమె సినిమాలకు సిద్ధం అవుతోందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విష్ణుప్రియ కష్టం వృధా పోకూడదని కోరుకుందాం.