ప్లీజ్..రణవీర్ ను అలా అనకండి..భరించలేను..అలియా మాటలకు అర్ధాలే వేరులే ..!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కు కోపం వచ్చిందా అంటే..అవుననే చెప్పాలి. అది తన గురించి అడిగిన ప్రశ్నకి కాదు..తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన క్వశ్చన్ కు ఆమె కు కోపం వచ్చింది. మనకు తెలిసిందే బాలీవుడ్ బడా హీరో రణవీర్ సింగ్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. అంతా ఇంతా కాదండోయ్..భీబత్సం..మరీ ముఖ్యం గా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . అంతెందుకు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఆయనకు పిచ్చ ఫ్యాన్.

రీసెంట్ గా కాఫీ విత కరణ్ షో ఆ విషయాని కన్ఫామ్ చేసేసింది. మాటకు ముందు రణవీర్..మాట తరువాత రణవీర్..ఏ ప్రశ్న అడిగిన రణవీర్ నే. అంతలా అమ్మడు ఓ రేంజ్ లో పొగిడేసింది. సీన్ కట్ చేస్తే.. తెర పైకి స్టార్ హీరో హాట్ న్యూడ్ ఫోటో షూట్ తాలుకా ఫోటోలు దర్శనమిచ్చాయి. అమ్మ బాబోయ్ ఆ స్టిల్స్ చూసి…రణవీర్ అవతారం చూసి..జనాలు దడుచుకున్నారు. హ్యూజ్ ట్రోలింగ్ కూడా చేశారు. ఓకే..ఆ విషయం పక్కన పెడితే..రణవీర్ లా మరికొంతమంది కూడా..న్యూడ్ ఫోటో షూట్ లు చేసి..ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక ఇదే విషయాని మీడియా కంట కనపడిన అలియాను ప్రశ్నించారు రిపోర్టర్లు. “అలియా జీ ..రణవీర్ న్యూడ్ ఫోటో గ్రఫీ పై మీ స్పందన..?మీకు ఏం అనిపించింది..?”అంటూ ఆమెను వరుస ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టేసారు. అంతే అమ్మడుకి మండిపోయింది. స్ట్రైట్ ఆన్సర్ ఇస్తూ..మీడియా పై మండిపడింది. “నా ఫేవరెట్ హీరో రణవీర్..ఆయన గురించి నేను ఎలా నెగటివ్ కామెంట్స్ చేయగలను. ప్లీజ్..దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను అడగద్దు. ఆయనకు నేను మాత్రమే కాదు..నా లా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన పై ఎవ్వరైన నెగిటీవ్ కామెంట్ చేస్తే భరించలేను ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అలియా కామెంట్స్ వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో ఇప్పుడు అలియా మాటల పై ద్వంద అర్ధాలు వెత్తుకుతున్నారు జనాలు.

 

Share post:

Latest