కథ నచ్చితే దానికి కూడా రెడీ..అక్కినేని హీరో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడురోయ్ ..!!

టాలీవుడ్ లో అక్కినేని అన్న పదానికి ఓ సపరేటు చరిత్ర ఉంది. అలాంటి ఓ అధ్బుతమైన మార్క్ ని సెట్ చేసి పెట్టారు అక్కినేని నాగేశ్వర రావు గారు. అయితే, ఆ పేరుని నాగార్జున ఊపయోగించుకున్నంత బాగా మిగతా హీరోలు వాడుకోలేకపోతున్నారు. అక్కినేని ఫ్యామిలీలో ఎంతో అమంది హీరోలు ఉన్నా కానీ, నాగార్జున తరువాత అంతటి పేరు సంపాదించుకునే సత్తా ఉన్న హీరో ఎవ్వరు లేరు అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.

నాగచైతన్య, అఖిల్..హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా ఇంకా సెటిల్ అవ్వలేదు అనే చెప్పాలి. ఇక సుమంత్ , సుశాంత్ విషయానికి వస్తే..వాళ్ళను ఇండస్ట్రీలో ఎవ్వరు అస్సలు పట్టించుకునే పరిస్ధితులు కనిపించడం లేదు. ఏవో పుష్కర కాలానికి ఓ సినిమా చేసుకుంటూ..ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే, ఇలాంటి కామెంట్స్ నుండి తప్పించుకుకోవడానికి సుమంత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

యస్.. ఇన్నాళ్లు హీరో గా చేసిన ఈ అక్కినేని కుర్రాడు ..ఇక పై విలన్ గా కూడా చేసేందుకు రెడీ అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’. ఈ సినిమాల్లో సుమంత్ ఓ సపోర్టింగ్ రోల్ లో నటించారు . రీసెంట్ గా ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్‌ విష్ణు శర్మ… మద్రాస్‌ రెజిమెంట్‌’’ అనే డైలాగ్‌ తో అభిమానుల్లో ఈ సినిమా పై భారీ హైప్స్ ఇచ్చారు. కాగా, ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..”నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న మొదటి సినిమా ఇదే. ‘సీతారామం’ లాంటి మంచి కథలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కధ బాగుంటే..నాకు నచ్చితే..విలన్ రోల్స్ కూడా చేస్తా..” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు సుమంత్. అక్కినేని నాగేశ్వర రావు గారి లాంటి బిగ్ లెజెండ్ మనవడు ఆఖరికి..ఇలా విలన్ రోల్స్ కి కూడా సిద్ధమంటూ చెప్పుకు రావడం సంచలనంగా మారింది.

Share post:

Latest