కొర‌టాల ఆఫీస్‌లో గ‌డ‌బిడ‌… మెగాస్టార్ ఇంటి ముందు ఆచార్య బాధితుల ధ‌ర్నా…?

ఆచార్య దెబ్బ‌నుంచి చిరంజీవి, కొర‌టాల ఇద్ద‌రూ ఇంకా కోలుకున్న‌ట్టు లేదు. ఆచార్య వాళ్ల‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ 25 మందికి పైగా సీడెడ్ ప్రాంతం నుంచి సెకండ‌రీ బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు క‌లిపి హైద‌రాబాద్‌లోని కొర‌టాల ఆఫీస్‌కు వ‌చ్చార‌ట‌. వీరంతా అక్క‌డే మకాం వేసి త‌మ న‌ష్టం భ‌ర్తీ చేసే వ‌ర‌కు క‌ద‌లం అని చెప్పేశార‌ట‌. రాత్రంతా వీళ్లు అక్క‌డే ఉండ‌డంతో పాటు తెల్ల‌వారాక అక్క‌డే బ్రెష్ చేసి స్నానాలు కూడా చేశార‌ని టాక్ ?

 

వీళ్ల‌ను స‌ర్దుబాటు చేసేందుకు మైత్రీ మూవీస్ సంస్థ న‌వీన్ రాయ‌భారానికి వెళ్లినా వీరు లొంగ‌లేద‌ట‌. సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ అభిషేక్ చాలా వ‌ర‌కు సెకండ్ బ‌య్య‌ర్ల‌కు అమ్మేశాడు. అలా ఆచార్య‌ను కొన్న వాళ్లంద‌రూ బాగా న‌ష్ట‌పోయారు. ఇటీవ‌ల ఆంధ్రా ఏరియా బ‌య్య‌ర్ల‌కు కొంత సెటిల్‌మెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు సీడెడ్ వాళ్లు త‌మ‌కు న‌ష్ట‌పోయిన అమౌంట్ కొంత భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో గ‌త రాత్రి నుంచి సీడెడ్ బయ్యర్ అభిషేక్, ఫైనాన్సియర్ శోభన్ కూడా అక్కడే పడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొంత వ‌ర‌కు స‌ర్దుబాటు చేస్తాం అని చెపుతున్నా వారు విన‌డం లేద‌ట‌. త‌మ‌కు బాగా అంటే రు. 15 కోట్ల‌కు పైగానే న‌ష్టం వ‌చ్చింద‌ని.. ఇప్పుడు ఎంత ఇస్తారో క్లారిటీ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఇప్పుడు కొంత ఇస్తే మిగిలిన బ్యాలెన్స్ ఎన్టీఆర్ సినిమాతోనో లేదా కొర‌టాల మ‌రో సినిమాతోనే భ‌ర్తీ చేయాల్సి ఉంది.

ఒక‌టి రెండు రోజుల్లో త‌మ‌కు క్లారిటీ రాక‌పోతే ఓవ‌రాల్‌గా 250 మందితో క‌లిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందే ధ‌ర్నా చేస్తామ‌ని హెచ్చరించిన‌ట్టు టాక్ ? మ‌రి ఈ సెటిల్మెంట్ల‌ను కొర‌టాల ఏం చేస్తాడో ? చూడాలి.