బాలయ్యతో హాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకులు ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పనిచేసిన ఎంతోమంది దర్శకులు..బాలయ్య కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు తో హాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. కోడి రామకృష్ణ – బాలకృష్ణ :
1984లో బాలయ్య హీరోగా మంగమ్మగారి మనవడు మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక ఆ తర్వాత 1986లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య సినిమా కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక 1987లో మువ్వగోపాలుడు అనే సినిమా కూడా హిట్ కొట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇకపోతే బాలయ్య బాబుతో కోడి రామకృష్ణ వరుస సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు

2. బి.గోపాల్ – బాలకృష్ణ:
1990లో వచ్చిన లారీ డ్రైవర్ , 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, 1999లో వచ్చిన సమరసింహా రెడ్డి ఇలా వరుస సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మూడు సినిమాలకు డైరక్టర్ బి. గోపాల్ కావడం గమనార్హం. ఇకపోతే వీరి కాంబినేషన్లో వచ్చిన నరసింహనాయుడు సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

3.బోయపాటి శ్రీను- బాలకృష్ణ:
2010 లో సింహ సినిమా తో వీరిద్దరి కాంబినేషన్ మొదలైంది.2014 లో లెజెండ్ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. 2021 లో వచ్చిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Share post:

Popular