ఇండస్ట్రీకి ‘ఒక్క మగాడు’ ఆయనే..సూర్య సంచలన కామెంట్స్..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..ప్రతి సినిమాలో ఢిఫరెంట్ స్టైల్ చూయిస్తూ..ఎప్పటికప్పుడు మారుతున్న ట్రేండ్ కి అనుగుణంగా సినిమాలు చేస్తూ..కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పేరుకి ఈయన కోలీవుడ్ హీరో అయినా..తెలుగులో కూడా మంచి పాపులారిటి తెచ్చుకున్నాడు. తమిళంలో చేసిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ చేయడంతో సూర్యకు మంచి మార్కేట్ ఏర్పడింది. మన స్టార్ హీరోల రేంజ్ లో ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే ఆయనపై అభిమానులు ఎలాంటి ప్రేమ ను చూయిస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే గత కొంత కాలంగా మనం సూర్య సినిమాలు చూసిన్నట్లైతే లవ్ స్టోరీ మూవీల కంటే కూడా సమాజానికి ఉపయోగపడేవి..లేక సోసైటికి అవసరమైన..తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలియజేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే..”ఆకాశం నీ హ‌ద్దురా”, “జై భీమ్” సినిమాలు చేసి..ఏ హీరో చేయలేని విధంగా రిస్క్ చేశాడట.

ఇప్పుడు వస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్ర కంటే హీరో పాత్రనే ఎక్కువ లీడ్ ఉండాలి అనుకుంటున్నారు మన హీరోలు. అలాంటిది “ఆకాశం నీ హ‌ద్దురా” మూవీలో భార్య చేత చెంప దెబ్బ తినడం..భార్య సంపాదనతో బ్రతకడం..వంటి సీన్లను రియలిస్టిక్ గా నటించాడు. అంతేకాదు..మీరు గమనించిన్నట్లైతే “జై భీమ్” సినిమాలో మొదట 40 నిమిషాలు అసలు సూర్య పాత్రే ఉండదు.. ఆ తరువాత ఎంటర్ అవుతుంది. మిగత హీరోలు అయితే ఖచ్చితంగా అలాంటి సినిమా చేయడానికి ఆలోచిస్తారు..కానీ సూర్య ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదట. ఎందుకంటే తనని హీరో గా చూయించుకోవడం కన్నా..ప్రజలకి ఉపయోగపడే సినిమాలు తీయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడట.

ఇదే కాదు సూర్య ఎప్పటికప్పుడు పేద అనాధ పిల్లల కోసం..చిన్న వయసులోనే పెద్ద జబ్బుల భరిస్తున్న చిన్నారులు కోసం తనకు వీలైనంత సహాయం చేస్తున్నాడు. అంతేందుకు సూర్య నటించిన సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ సినిమా చూసి ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ సిగ‌రెట్ తాగ‌డం ఆపేశాడ‌ట‌. ఈ విషయాని సూర్యనే స్వయంగా చెప్పుకొచ్చాడు. “కేవ‌లం వినోదం కోస‌మే కాకుండా ఇలాంటి మార్పు కోసం కూడా సినిమాలు చేయాలి. నేను ప్రేక్ష‌కులను ఆలోచింప‌జేసేలా సినిమాలు చేయ‌డం నా బాధ్య‌త‌గా భావిస్తా”.. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్స్ డబ్బు గురించి కాకుండా జనాల గురించి ఆలోచిస్తున్నావ్ చూడు నువ్వు ఇండస్టీకి “ఒక్క మగాడివి” అంటూ సినిమా టైటిల్ తో పొగిడేస్తున్నారు.