సుడిగాలి సుదీర్ కు నిశ్చితార్థం అయిందా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?

సుడిగాలి సుదీర్.. ఇతను జబర్దస్త్ కమెడియన్ అనే మాటే గాని అతనికి ఉన్న క్రేజ్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కేవలం కమెడియన్గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా డాన్సర్ గా యాంకర్ గా ఇలా చెప్పుకుంటూ పోతే మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో సుడిగాలి సుదీర్ కు సంబంధించిన వార్త ఏదైనా వచ్చిందంటే చాలు క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

సుడిగాలి సుదీర్ పెళ్లి తీసుకోబోతున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా రష్మీ ని కాదు వేరే అమ్మాయిని అని తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు రష్మీ సుధీర్ ప్రేమించుకుంటున్నారు వీరిద్దరు త్వరలో పెళ్లి ఉంటారు అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త అమ్మాయి తెర మీదకు రావడం తో హాట్ టాపిక్ గా మారిపోయింది. సుడిగాలి సుదీర్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ కు నిశ్చితార్థం అయినట్లు చూపించారు. అయితే ఈ టీవీ లో ఇదేం కొత్తకాదు.

గతంలో రష్మీ సుధీర్ పెళ్లి జరిగినట్లు చూపించారు. సుధీర్ విష్ణు ప్రియ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. కానీ ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే… ఇప్పటి వరకు బుల్లితెర పై ఎక్కడా కనిపించని కొత్త అమ్మాయి చేతికి సుడిగాలి సుధీర్ రింగ్ తొడగడమే. దీంతో రష్మీ తో పెళ్లి జరిగినప్పుడు కేవలం ఈవెంట్ కోసమే అనుకున్న ప్రేక్షకులు ఇక ఇప్పుడు కొత్త అమ్మాయికి సుధీర్ సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడా చర్చ మొదలుపెట్టారు. ఇక ఇలా సుధీర్ రింగు తొడిగిన అమ్మాయి పేరు తేజస్వి నాయుడు ఈమె మోడలింగ్ వృత్తిలో కొనసాగుతోంది. పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇలా ఈ అమ్మడి పాపులారిటీని ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయిన ఈటీవీ వాళ్ళు తనతో ఒక షో ప్లాన్ చేసారు అనేది తెలుస్తుంది. సుధీర్ పక్కన ఒక్కసారిగా ఈ అమ్మడు కనిపించడంతో ప్రస్తుతం ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి అందరు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు.