మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. అటువంటి వ్యక్తి పరువును ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ హరితేజ ఒక్క ఫొటోతో తీసేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
రవితేజ తమ్ముడు, నటుడు భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన తమ్ముడిని చివరి చూపు చూడటానికి రవితేజ రాక పోవడం, కనీసం అంత్యక్రియల్లో పాల్గొనక పోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దీంతో తమ్ముడిని అలా చూసి భరించలేకనే అంత్యక్రియలకు వెళ్ళలేదని రవితేజ క్లారిటీ ఇచ్చాడు.
కానీ, అంత్యక్రియలు జరిగిన తర్వాత రోజే రవితేజ `రాజా ది గ్రేట్` సినిమా షూటింగ్ పాల్గొన్నారు. అంతే కాదు, సెట్స్‌లో తోటి నటులతో నవ్వుతూ ఫొటోకు పోజులిచ్చారు. అయితే ఆ ఫొటోను ఈ సినిమాలో ఓ పాత్రను పోషించిన హరితేజ..ఫేస్ బుక్ లో షేర్ చేసి తమ్ముడు చనిపోయిన కూడా సంతోషంగా ఉండు అంటూ విమర్శించింది.
ఆమె పోస్ట్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. నెటిజన్లు రవితేజను ఏకిపారేశారు. మీడియా వారు కూడా రవితేజపై నెగటివ్ కథనాలను ప్రచురించారు. అయితే వీటిపై స్పందించిన రవితేజ.. `తమ్ముడు చనిపోయాడని బాధలేక కాదు..తోటి నటీనటులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే నవ్వాను` అంటూ స్పష్టత ఇచ్చాడు. దీంతో రవితేజ మనసులో ఎంత బాధ ఉందో తెలుసుకోకుండా ఫొటో పెట్టి పరువు తీసిందంటూ హరితేజపై ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు.