టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకుని అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవడానికి అసలైన కారణం ఏంటో బయటకు రాకపోయినా.. ఎన్నో కథనాలు మాత్రం తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా సమంత బోల్డ్ రోల్స్ చేయడం చైతుకి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చలేదని.. ఈ విషయంలో గొడవలు జరగడం వల్లే సామ్-చైతులు విడిపోయారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చైతు చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఇటీవల చైతు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ యాంకర్ `మీరు ఎలాంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపరు?` అని ప్రశ్నించారు.
అందుకు చైతు స్పందిస్తూ.. `నేను అన్నీ తరహా పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు. నా కుటుంబంపై ప్రభావం చూపే విధంగా ఉంటే మాత్రం చేయను` అని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు చైతు సామ్ గురించే మాట్లాడడని, ఆమెపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, చైతు సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `లవ్ స్టోరీ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈయన ప్రస్తుతం `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` మూవీలోనూ నటిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈయన చేతుల్లో ఉన్నాయి.
Nee clarity @chay_akkineni 👌👌 pic.twitter.com/LAXv1T6AMz
— Risheek (@risheek_king) December 10, 2021