వెంకీ ఇప్ప‌టివ‌ర‌కు ఏయే హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేశాడో తెలుసా?

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విక్ట‌రీ వెంక‌టేష్‌.. త‌న‌దైన న‌ట‌న‌, ట్యాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదిగి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ఒంటరి పోరాటం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశంలోనూ మెరిసి మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల మ‌దిలో స్పెష‌ల్ ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకున్నాడు.

అదే స‌మ‌యంలో అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోగానూ గుర్తింపు పొందిన వెంకీ.. ఇప్ప‌టికే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతూ అటు సీనియ‌ర్ హీరోల‌కు, ఇటు కుర్ర హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వెంకీ.. ఇత‌ర‌ హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు భారీగానే చేశాడు. మ‌రి వెంకీ ఇప్ప‌టివ‌ర‌కు ఏయే హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేశాడో ఓ లుక్కేసేయండి.

కొండపల్లి రాజా: వెంకటేష్ కెరీర్లో ఇదే మొదటి మల్టీస్టారర్ చిత్రం. హీరో సుమన్‌, వెంకీ క‌లిసి న‌టించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

సంక్రాంతి: ముప్పలనేని శివ దర్శకత్వం వ‌హించిన ఈ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో వెంకీ.. శ్రీ‌కాంత్‌, శ‌ర్వానంద్‌, శివబాలాజీ క‌లిసి న‌టించాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: వెంక‌టేష్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో వ‌చ్చిన ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 2013లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ఈనాడు: లోక‌నాయ‌కుడు కమల్ హాసన్‌తో వెంకటేష్ చేసిన ప్రయోగాత్మక చిత్రమిది. 2009లో విడుదలైన ఈ మూవీ ఓ మోస్త‌రు టాక్‌ను సొంతం చేసుకుంది.

మసాలా: వెంక‌టేష్‌, టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కాంబోలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేక‌పోయింది.

గోపాల గోపాల: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వెంక‌టేష్ క‌లిసి న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం యావరేజ్ టాక్ ను సొతం చేసుకుంది.

వెంకీమామ‌: మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో వెంకీ న‌టించిన వెంకీమామ 2019లో విడుదలై ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది.

ఎఫ్ 2: వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం 2019లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు.