వీకెండ్ అయితే మేలు గురూ..

శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది ఎందుకంటే.. అవినీతి ఆరోపణలు, నేరాలు చేసిన వారిని అరెస్టు చేయడానికి.. వారిళ్లల్లో సోదాలు చేయడానికి. ముఖ్యంగా శుక్రవారాలనే ఈ దాడులకు ఎంచుకుంటున్నారు.

ఎందుకంటే నిందితులను అరెస్టు చేసిన తరువాత వారిని కోర్టులో హాజరు పరచాలి. మిగతా రోజుల్లో అయితే తరువాతి రోజులు వర్కింగ్ డేస్.. కోర్టులు పనిచేస్తాయి. వీకెండ్ లో దాడులు చేసి అరెస్టు చేస్తే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సోమవారం వరకు గడువుంటుంది. అంటే.. శని, ఆదివారాలు విచారణకు గడువు లభిస్తుంది. వారికి కావాల్సిన సమాచారం రాబట్టవచ్చు. శుక్రవారం హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంటిలో సోదాలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఈయన సీఎంఓలో పనిచేశారు. ఏపీ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలా వీకెండ్ దాడులు కొనసాగుతున్నాయి. అందుకు చాలా ఉదాహరణులున్నాయి..

1. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ఇంటిపై సోదా చేసింది 2021 మే 14. ఆ రోజు శుక్రవారం.

2. టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ఇంటిలో సోదా చేసింది 2021 జూన్ 12. శనివారం

3. టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసింది గత సంవత్సరం జూన్12. శుక్రవారం

4. మాజీ ఎమ్మెల్యే ధూళిపాలనరేంద్రను అరెస్టు చేసింది 2021 ఏప్రిల్ 23. శుక్రవారం