ఆ యంగ్ హీరో వ‌ల్ల‌ ఏడ్చిన పూరి జగన్నాథ్‌..అస‌లేం జ‌రిగిందంటే?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ యంగ్ హీరో వ‌ల్ల ఏడ్చారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. ఆయ‌న త‌న‌యుడు ఆకాష్ పూరి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆకాష్ పూరి హీరోగా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్`. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు.

CoronaCrisis: Akash Puri urges fans to refrain from celebrating his birthday on a large scale | Telugu Movie News - Times of India

అలాగే ఈ సినిమాకు కథ, మాటలు , స్క్రీన్ ప్లే పూరినే స్వ‌యంగా అందంచ‌గా..అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 4న‌ విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ అనిల్ పాదూరి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..ప్రేమను నమ్మని ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది `రొమాంటిక్` కథ. ఈ పాత్రకు ఆకాశ్‌ వంద శాతం న్యాయం చేశాడ‌ని తెలిపారు.

Image

అలాగే `నేను ఈ సినిమా ఫస్టుకాపీని పూరి గారికి చూపించాను. ఈ సినిమాలోని ఒక ఎమోషన్ సీన్ చూసిన ఆయన, వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం పూరీగారు మాట్లాడుతూ.. నేను రాసిన ఈ సీన్లో ఇంత ఎమోషన్ ఉందా? నేను తెర‌కెక్కించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లో ఎమోషన్‌ ఉంది.. కానీ, రొమాంటిక్ లో అంత కంటే ఎక్కువగా ఉంది.. సినిమా బాగా తీశావ్‌.. నీకు మంచి భవిష్యత్తు ఉంది` అంటూ ప్ర‌శంసలు కురిపించార‌ని అనిల్ పాదూరి చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడీయ‌న కామెంట్స్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేశాయి.