ప్రభాస్‌ ఫోన్‌ చేసి పదే పదే అడిగారు..పూరి జగన్నాథ్?

ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఇక ఈ సినిమా గురించి హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమా ట్రైలర్ నిజంగానే రొమాంటిక్ గా ఉంది. ఇందులో ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ లో అద్భుతంగా అనిపించాడు. ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. దర్శకుడు అనిల్ పాదూరి కూడా ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు అని తెలిపారు ప్రభాస్.ఈ సినిమాలో ఆకాష్ వాస్కో పాత్ర లో, మౌనిక పాత్రలో కేతికశర్మ నటించారు.

- Advertisement -

తాజాగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ప్రభాస్ రొమాంటిక్ ట్రైలర్ ను విడుదల చేసిన వీడియోలు ప్లే చేశారు. తర్వాత ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. రొమాంటిక్ ట్రైలర్ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? ఈవెంట్ కు రావాలా అని అడిగారు? ప్రభాస్ చాలా మంచివారు. రొమాంటిక్ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారని పూరి తెలిపాడు. ఇందులో ఆకాష్, కేతికా శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

Share post:

Popular