బాల‌య్య నెక్స్ట్‌కి సూప‌ర్ టైటిల్ పిక్స్ చేసిన గోపీచంద్‌..?!

ప్ర‌స్తుతం నందమూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక అఖండ‌ త‌ర్వాత త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాల‌య్య డైరెక్ట‌ర్ గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు.

- Advertisement -

Balakrishna so impressed with Gopichand Malineni

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ గోపీచంద్ సూప‌ర్ టైటిల్ పిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Nandamuri Balakrishna teams up with director Gopichand Malineni for #NBK107

ఇంత‌కీ టైటిల్ ఏంట‌నేగా మీ డౌంట్‌.. `జై బాలయ్య`. అవును, యాక్షన్ ఓరియంటెడ్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీకి `జై బాలయ్య` అనే టైటిల్ బాగా సూట్ అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అంతేకాదు, మైత్రీ వారు ఇప్ప‌టికే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టు కూడా తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular