పెళ్లిపై అవగాహన కలిగించిన సినిమా ఇది..అల్లు అరవింద్?

అక్కినేని ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య జర్నీ 65 ఏళ్లుగా సాగుతూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ నెల 15న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ నాగార్జున గారితో సినిమా తీశా, మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను అంటూ అల్లు అరవింద్ తెలిపారు. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ..

అఖిల్ సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. అఖిల్ డాన్స్, ఫైట్ బాగా చేస్తాడు. కానీ వాటన్నిటినీ పక్కనపెట్టి ఒక మంచి సినిమా చేయాలని ఈ సినిమా చేయాలి అన్న తన ఛాయిస్ నేను గౌరవిస్తాను. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా కూడా బాగా హిట్ అయింది. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. ఇది ఎంతో సంతోషాన్నిచ్చింది అని తెలిపారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనుకునే వారు చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్ ఈ కథ రాశారు. పెళ్ళి పై మంచి అవగాహన కలిగించిన సినిమా ఇది అని తెలిపారు.