బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా సపోర్ట్ అంటున్న సింగ‌ర్ నోయ‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సింగర్‌, యాక్టర్‌ నోయల్‌ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నోయ‌ల్‌.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదో సీజన్‌లో నోయల్ ఓ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

Noel Sean (Bigg Boss Telugu 4) Wiki, Age, Girlfriend, Wife, Family,  Biography & More - FilmyVoice -

ఇంత‌కీ నోయ‌ల్ స‌పోర్ట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు..సింగర్‌ శ్రీరామచంద్ర. మూడో వారం ప్రియ, ల‌హ‌రి, ప్రియాంక‌, మాన‌స్‌తో పాటుగా శ్రీ‌రామ్ కూడా నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే నోయ‌ల్ త‌న అభిమానుల‌ను శ్రీ‌రామ్‌కు ఓట్లు వేయాల‌ని రిక్వ‌స్ట్ చేశాడు.

Bigg Boss Telugu 5 contestant Sreerama Chandra's profile, photos and all  you know about the singer-turned-actor - Times of India

కాగా, అనధికారిక పోల్స్‌లో అయితే శ్రీరామ్‌కు ఈవారం ఈజీగా సేఫ్‌ అవుతాడని తెలుస్తోంది. ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మ‌రి ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కేది ఎవ‌రు..? దుకాణం స‌ద్దేసేది ఎవ‌రు..? అన్న విష‌యాలు తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.