‘గని’ రిలీజ్ తేదీ ఖరారు..?

మెగా కాంపౌండ్ వారసుడు వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న గని సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని గత నెలలోనే రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా.. కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్లు కుదరలేదు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది.

అందుకోసమే దీపావళి బరిలో నిలవాలని మేకర్స్ చూస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన ఈ మూవీలో ముద్దుగుమ్మ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఇక పోతే ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సిద్ధూ ముద్దా, అల్లు బాబీ అనే నిర్మాతలు వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ విషయంపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Share post:

Popular