ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్..ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫొటోలో క్యూట్‌గా చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్న ఆ చిన్న‌ది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతోంది. తెలుగుతోనే కాదు.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. కనిపెట్టలేకపోతున్నారా..? అయితే మీకో చిన్న క్లూ..

Pooja Hegde was one cool kid and her childhood photos are PROOF; Check out

ఈ హీరోయిన్‌ను ఫ్యాన్స్ ముద్దుగా `బుట్ట‌బొమ్మ‌` అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.. అదేనండీ మ‌న పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అలా వైకుంఠ‌పురుములో.. ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

Pooja Hegde Biography, Boyfriend, Age, Career - Famous Biography

మ‌రోవైపు బాలీవుడ్‌లోనూ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం.. రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, మ‌హేష్ 28వ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో విజ‌య్ స‌ర‌స‌న బీస్ట్‌లో మెర‌వ‌నుంది. ఇక హిందీలో సర్కస్‌, భాయిజాన్ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూజా.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంటుంది.