ఎన్టీఆర్‌తో ఒక్క‌సారి అలా చేయాల‌నుంది..వనిత షాకింగ్ కామెంట్స్!

సీనియ‌ర్ న‌టి వనిత విజయ్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే వ‌నిత ఎవ‌రో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వ‌నిత పాల్గొంది.

తాజాగా ఈ షో ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్ర‌శ్న‌లంద‌రికీ.. వ‌నిత త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పింది. దేవి సినిమా తర్వాత ఎందుకు తెలుగులో న‌టించ‌లేద‌ని ప్రశ్నించగా.. వెంటనే వనిత బుర్ర సరిగా లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. త‌న ఫ్యామిలీ గురించి కూడా ప‌లు విష‌యాలను తెలిపింది.

అలాగే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన వ‌నితా.. జూనియర్ ఎన్టీఆర్ తో క‌నీసం ఒక్క‌సారైనా, ఒక్క షాట్‌లో అయినా న‌టించాల‌నుంద‌ని పేర్కొంది. మ‌రి వ‌నిత కోరిక నెర‌వేరుతుందో.. లేదో..చూడాల్సి ఉంది.