ఎన్టీఆర్ ఎన‌ర్జీకి ఆయ‌న తోడైతే ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌?!

ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

music director anirudh, ntr 30 movie, ntr, latest news, koratala shiva,  tollywood news, telugu movies,

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించే యంగ్ మ్యూసిక్ డైరెక్ట‌ర్‌ అనిరుధ్ ఎన్టీఆర్ 0వ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.

Southsuper - Anirudh Ravichander music for Jr NTR in Koratala Siva film -  Entrendz Showbizz

అంతేకాదు, అనిరుధ్‌ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్‌ చేశాడని.. అత‌డి క్రేజ్ దృష్ట్యా చిత్ర యూనిట్‌ కూడా అనిరుధ్‌ అడిగినంత ముట్టచెప్పడానికి సిద్ధంగా ఉందని టాక్‌ నడుస్తోంది. ఏదేమైనా.. ఎన్టీఆర్ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్‌కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ తోడైతే ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు అన‌డంలో సందేహ‌మే లేదు.

 

Share post:

Popular