తారక్ కోసం తెలుగువారిని పక్కనబెడుతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేతిలోకి వెళ్లింది. దీంతో కొరటాలతో తారక్ రెండోసారి జతకట్టనున్నాడు. గతంలో వీరిద్దరి నుండి ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సబ్జెక్ట్‌తో సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే తారక్ చిత్రం కోసం కొరటాల ఈసారి భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రొటీన్‌గా కాకుండా తారక్ చిత్రం కోసం ఈసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ను వాడాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే అనిరుధ్ రవిచంద్రన్‌ను ఫైనల్ కూడా చేశారట. ఏదేమైనా తారక్ కోసం కొరటాల శివ ఈసారి ఏదో కొత్త ప్రయోగం చేయడం ఖాయమని దీన్ని బట్టి తెలుస్తోంది. మరి ఈ కాంబలో వచ్చే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.