వ‌రుణ్ తేజ్ `గ‌ని` సెట్స్‌లో పుష్ప‌రాజ్ సంద‌డి!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `గ‌ని`. బాక్సాంగ్ నేప‌థ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Image

ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంక‌ట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా మ‌న పుష్ప‌రాజ్ గ‌ని సెట్స్‌లో సంద‌డి చేశారు. సినిమా త్వరగా కంప్లీట్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధిచాలని కోరుతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడట.

Image

మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా అన్న బాబీతో దిగిన ఫొటోను షేర్ చేసిన బ‌న్నీ..ఫిలిం మేకర్‌గా అన్నయ్య జర్నీ సక్సెస్ ఫుల్‌గా సాగాలని పేర్కొన్నారు. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌ పుష్ప‌రాజ్ గా క‌నిపించ‌నున్నాడు.

Share post:

Popular