`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు.

- Advertisement -

పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న విడుద‌‌ల కానుంది. ఇటీవ‌లె విడుద‌లైన లెవ‌న్త్ అవ‌ర్ టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు.. ఈ వెబ్ సీరిస్‌పై అంచ‌నాలు కూడా పెంచేశాయి.

ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు తమన్నా భారీ రెమ్యునరేషన్ ను తీసుకుందని తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం తమన్నా దాదాపు రెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఒక వెబ్ సిరీస్‌కు రెండు కోట్లంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

Share post:

Popular