వైరల్ ఫోటో : టెర్రరిస్ట్ గా సమంత..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్  సమంత. తాజాగా సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ద్వారా  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు  సమాచారం. ఇది ఇలా ఉండగా తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా దర్శకులు దర్శకులు రాజ్, డీకే ది ఫ్యామిలీ మెన్2 లో సమంత క్యారెక్టర్ లుక్  సోషల్  మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ లుక్ లో  సమంత పూర్తిగా డి గ్లామర్ గా కనిపించి ప్రేక్షకులకు అందరికీ షాక్ ఇచ్చింది.  ఐతే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో మాత్రం సమంత హీరోయిన్ అనే ఇమేజ్ కి దూరంగా ఉండే పాత్రలో ప్రేక్షకుల ముందుకురాబోతున్నట్లు  అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.