పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!

ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు […]

వీకెండ్ అయితే మేలు గురూ..

శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది […]

నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]

రోజులు అసలే బాగాలేవు..అలా అంటే ఎలా సార్.. !

కరోనా మొదటి దశ.. రెండో దశ అయిపోయింది.. ఇపుడు ఒమిక్రాన్ అంటున్నారు.. దేశంలో పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు..మాస్కు తప్పనిసరి.. గ్రూపులుగా ఉండొద్దని కోవిడ్ నిబంధనలు చెబుతున్నాయి..ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రలును ఇబ్బందులకు గురిచేస్తోంది. పిల్లలకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాల్సిందే అని నిబంధన పెట్టింది. అలా అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెబుతోంది. […]

పీఆర్సీ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్

ఏపీలో ఉద్యోగులు అనేక రోజులుగా పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతో వారు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు.. పీఆర్సీ ఇవ్వకపోతే విడతల వారిగా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. సీన్ కట్ చేస్తే సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ.. పది రోజుల్లో పీఆర్సీ ఇచ్చేస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులకు షాక్.. ఇదేంటి మేము సమ్మె చేస్తామని చెబితే పీఆర్సీ ఇచ్చేశారు […]

ఏపీలో ఉద్యోగులకు హ్యాపీ.. పీఆర్‌సీకి జగన్‌ అంగీకారం

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కరుణించారు. పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) పది రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. శుక్రవారం సీఎం జగన్‌ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు సీఎంను కలిసి పీఆర్‌సీ ఇవ్వాలని కోరినప్పుడు జగన్‌ ఈ మాట ఇచ్చేశారు. సీఎం నుంచి ఈ సమాధానం ఊహించని ఉద్యోగ సంఘాల నాయకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పటికే […]

ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నపుడు రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్‌ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]

సర్కారు ఉద్యోగుల సమ్మె బాట

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు […]

ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. […]