తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటికి లభిస్తున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ఆయన వెన్నులో చలి మొదలైందా? అందుకోసం.. పవన్ కు ఉన్న అంతో ఇంతో బలాన్ని కూడా కలుపుకుని […]
Tag: YS Jagan
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!
సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]
ఏపీలో మూసేసిన సినిమా థియేటర్ల ఓపెన్..!
ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించి మూసివేత గురైన థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా కొద్ది రోజుల కిందట ఏపీలో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చి తామే సినిమా టికెట్లను విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమైంది. తగ్గించిన టికెట్ ధరలు పెంచాలని పలువురు సినీ […]
సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!
భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]
జనంలో కాదు సోషల్ మీడియాలో యాక్టివ్
ఆర్‌కే అలియాస్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. […]
అధికారంపై ఎన్ని ఆశలో..
ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]
ఫస్ట్ ఎటు పోదాం సామీ?
ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]
ఏం జరుగుతోందో నాకు తెలియాలి?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు […]









