ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు .. ఇదీ ఆయన నైజం.
ఇకపోతే పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? ప్రజల్లో వారిపట్ల ఎలాంటి అభిప్రాయాలున్నాయి? అనే సందేహం జగన్ కు కలిగింది. దీంతో తన టీమ్ ను రంగంలోకి దింపారట. ఎవ్వరికీ తెలియకుండా.. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రజల్లోకి పంపారట. పలుచోట్ల పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చే నివేదికలను కూడా ఆయన నమ్మడం లేదని తెలిసింది. అందుకే షాడో టీమ్స్ ను దించి మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారనే దానిని కనిపెట్టి రిపోర్టివ్వాలని ఆదేశించారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయట. ఎవరు కోవర్టో గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారట. ఏదైనా మంచికే కదా..