రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]
Tag: YS Jagan
స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది
చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య […]
పేర్ని నాని మరియు రెండు మాటలు..
సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]
వేటు పడకముందే వెళ్లే అవకాశం..
ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]
ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!
సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల […]
సినిమా టికెట్ ధరలపై చెప్పకనే చెప్పేసిన జగన్
ఏపీలో సినిమా ధరల తగ్గింపు, టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం.. సౌకర్యాలు లేని థియేటర్లను సీజ్ చేయడం .. లాంటివి కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేశారు. ఇక వీటికితోడు తక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే థియేటర్ నిర్వహణ కూడా కష్టమవుతుందని కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవ్వరూ నేరుగా ఖండించడం లేదు. సినిమా పెద్దలైతే మంచి రోజులొస్తాయి.. సీఎం నిర్ణయం […]
RRR : కథ అడ్డం తిరిగింది
రఘురామ క్రిష్ణం రాజు.. సింపుల్ గా RRR.. ఏపీలో అధికారికంగా అధికార పార్టీ ఎంపీ.. అయితే ఆయన మాత్రం అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకి.. ఏకంగా పార్టీ అధినేతపైనే తిరుగుబావుటా ఎగురవేసిన వ్యక్తి.. జగన్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి తరువాత పార్టీలో ఉంటూ పార్టీనే తిడుతూ పార్టీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నాడు. అయినా పార్టీ ఆయనను పట్టించుకోదు.. ఆయన కూడా దాని గురించి ఆలోచించడు. RRRకు కోపం ఎంత […]
దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?
భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో […]
దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!
సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]









