RRR : కథ అడ్డం తిరిగింది

రఘురామ క్రిష్ణం రాజు.. సింపుల్ గా RRR.. ఏపీలో అధికారికంగా అధికార పార్టీ ఎంపీ.. అయితే ఆయన మాత్రం అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకి.. ఏకంగా పార్టీ అధినేతపైనే తిరుగుబావుటా ఎగురవేసిన వ్యక్తి.. జగన్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి తరువాత పార్టీలో ఉంటూ పార్టీనే తిడుతూ పార్టీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నాడు. అయినా పార్టీ ఆయనను పట్టించుకోదు.. ఆయన కూడా దాని గురించి ఆలోచించడు. RRRకు కోపం ఎంత వరకవచ్చిందంటే జగన్ వేసే ప్రతి అడుగును గమనిస్తాడు. ప్రత సంక్షేమ కార్యక్రమాన్నిపరిశీలిస్తాడు. జగన్ పథకాలను అమలు చేస్తున్నాడని ఎవరైనా అంటే.. ఆయనేమైనా సొంత జేబులోంచి ఇస్తున్నాడా అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. మరో అడుగు ముందుకేసిన RRR .. అక్రమ ఆస్తుల కేసులో ప్రస్తుతం జగన్ బెయిలుపై ఉన్నాడని, బెయిలు రద్దు చేయాలని కోర్టుకు వెళ్లాడు. ఎంత వీలైతే అంత జగన్ ను ఇరుకునపెట్టాలని RRR చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయనకు దిమ్మతిరిగే నిర్ణయం సీబీఐ తీసుకుంది. నిత్యం సీబీఐ, జగన్, బెయిలు అంటూ మాట్లాడే RRR ఇపుడు షాక్ లో ఉండిపోయాడు. ఇంతకీ అసలు విషయమేమంటే.. గతంలో కన్సార్షియ నుంచి RRR రుణం తీసుకున్నాడు. అయితే దానిని చెల్లించకపోవడంతో కేసు సీబీఐ కు వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసి చార్జి షీటు కాడా ఫైల్ చేసింది. దీంతో ఖంగుతిన్న RRR సంకటస్థితిలో పడ్డాడు. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాడు. అన్ని విషయాలను కోర్టులోనే చెబుతానని, రేపో, మాపో జైలుకు వెళ్లే వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ కూడా చేశాడు. రుణం ఎగవేసిన కేసులో RRRతోపాటు ఆయన సంస్థలు, అనుబంధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, సీఏలతో కలిపి 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరి కోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.