వేటు పడకముందే వెళ్లే అవకాశం..

ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. అన్నీ దగ్గరకొచ్చేశాయి.. అందుకే వేటు పడకముందే తనే సైడ్ అయ్యే అవకాశం ఉంది.. ఇవన్నీ ఎవరి గురించో కావు.. వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ గురించే.. అదే రఘు రామక్రిష్ణం రాజు..

ఈయన ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే.. కొద్ది రోజుల్లోనే ఈయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారని తెలిసింది. ఈ వారంలోనే తన రాజీనామాను స్పీకర్ కు సమర్పించి వైసీపీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడని సమాచారం. అనర్హత వేటు పడే ముందే రాజీనామా చేస్తే పరువైనా దక్కుతుందని రాజు తన సన్నిహితులతో చెప్పాడట. మరి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత రాజకీయ భవిష్యత్తు అనే ప్రశ్న సాధారణంగా వస్తుంది. అందులో డౌటేముంది.. ఆయన ఎలాగూ బీజేపీకి బాగా దగ్గరయ్యారు.. కమలం పార్టీ పెద్దలను తరచూ కలుస్తూ ఫొటోలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చేలా చూస్తున్నాడు. ఎలాగూ సీబీఐ కేసులూ ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసే చాన్స్ లేదు.. తెలుగుదేశం పార్టీ పరిస్తితీ బాగాలేదు.. అందుకే కమలం కండువా కప్పుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫ్యాను గాలిని వీడీ కమలం సువాసన పీల్చనున్నాడు. బీజేపీ పెద్దలు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీలో చేరితో తనపై ఉన్న కేసుల తీవ్రత తగ్గడంతోపాటు విచారణ కూడా నెమ్మదిగా సాగుతుందనేది రాజుగారి మదిలో ఆలోచనట. మరి ఏం జరుగుతుందో చూడాలి.