ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. అలాగని రూ.10వేల కోట్ల రూపాయల రుణం ఎలా వదిలేస్తారు.. అందుకే ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే లబ్దిదారులు రుణం ఎంత తీసుకున్నా కొంత మొత్తం చెల్లిస్తే బకాయి మొత్తం చెల్లించనట్లవుతుంది.. ఆ ఇంటిపై వారికి సర్వ హక్కులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్ పరిధిలో అయితే రూ.20వేలు చెల్లించాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఒకవేళ ఓటీఎస్ కంటే చెల్లించాల్సిన మొత్తం తక్కువ ఉంటే ఎంత ఉంటే అంత చెల్లించాలని సర్కారు చెబుతోంది. అయితే ఇది బలవంతమేమీ కాదని.. లబ్ధిదారులు తమ ఇష్టపూర్వకంగానే చెల్లించవచ్చని హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయితే జగన్ సర్కారు డబ్బు వసూలు చేయాలని ఆలోచిస్తోంది.

తెలంగాణలో ఏం జరిగిందంటే..

ఏపీలో సర్కారు వసూలు గురించి ఆలోచిస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఉమ్మడి ఏపీలో నిర్మించిన ఇళ్లన్నింటికీ రుణాలు మాఫీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్మించిన ఇళ్లకు మాత్రమే బకాయిలు వసూలు చేస్తున్నారు. 1983 నుంచి 2014 జూన్ 2 వరకు ఉన్న బకాయిలను సర్కారు రద్దు చేసింది. కేసీఆర్ నిర్ణయంతో 29.64 లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. 3920 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. శాశ్వత గ్రుహనిర్మాణ పథకం కింద 2983 నుంచి జూన్ 2014 వరకు 2,16,652 ఇండ్లు నిర్మించారు. కార్మికులు, పేదలు.. ఇలా చాలా మంది వీటిని నిర్మించుకున్నారు. వారి సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకొని రుణాలు మాఫీ చేశారు. అయితే 2014 తరువాత నిర్మించిన ఇళ్లకు మాత్రం రుణాలు వసూలు చేస్తున్నారు. కేసీఆర్ ఆలోచించినట్లే మీరూ ఆలోచించండి సార్.. అని ఏపీ ప్రజలు కోరుతున్నారు.