పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో తిరిగి ప్రారంభం కానుంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మరో సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ హరిహర వీరమల్లుతో పాటు ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ముందుగా హరిహర వీరమల్లు ప్రారంభమై ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం హరీష్ శంకర్ తన సిబ్బందితో కలిసి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు గాను లొకేషన్ల వేటలో ఉన్నారని సమాచారం. లొకేషన్ సెలక్షన్ పూర్తయిన వెంటనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.