రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ : సిద్ శ్రీరామ్ మ్యాజిక్ మొదలైంది..!

December 2, 2021 at 1:07 pm

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఎట్టకేలకు సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాట విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిన్న ఈ పాట హిందీ వెర్షన్ విడుదల కాగా.. రాత్రి తెలుగు వెర్షన్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ మేకర్స్ పాటను విడుదల చేయలేదు. ఎట్టకేలకు కొద్దిసేపటి కిందట ఈ పాట తెలుగు వెర్షన్ విడుదల చేశారు.

నగుమోము తారలే.. అంటూ సాగే మెలోడీ పాటను టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అదిరిపోగా సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో పాటను మరో రేంజ్ కి తీసుకెళ్లాడు.
పాటలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. వారి జంట స్క్రీన్ పై చూడ ముచ్చటగా ఉంది. మామూలుగా ఏ సినిమా అయినా వేరే భాషల్లో విడుదల అవుతుందంటే.. మాతృకలో ఉన్న పాటలనే యధాతధంగా డబ్ చేసి విడుదల చేస్తుంటారు.

కానీ ఈ సినిమాకు బాలీవుడ్ వెర్షన్ ఒకరు, తెలుగు వెర్షన్ కు మరొకరు సంగీతం అందిస్తున్నారు. దీంతో నిన్న విడుదలైన హిందీ పాటతో పోలిస్తే ఈ పాట వేరేగా ఉంది. హిందీ పాట కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా రాధే శ్యామ్ సెకండ్ సింగిల్ సాంగ్ తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు కూడా విడుదలయ్యాయి. రాధే శ్యామ్ జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.

 

రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ : సిద్ శ్రీరామ్ మ్యాజిక్ మొదలైంది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts