తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?

అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]