ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. మోడీ వేవ్ బాగుండ‌డంతో మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడైనా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవాల‌న్నంత ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నారు. ఏపీలో మాత్రం నంద్యాల ఫ‌లితం ముందు వ‌ర‌కు ముంద‌స్తుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ సీఎం చంద్ర‌బాబు నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను వార్ టీడీపీకి […]

కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితం ఇలా ఉండ‌బోతోందా..!

కాకినాడ కార్పొరేషన్‌లో గెలుపు తమదే అని రెండు ప్రధాన పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేయర్‌ పీఠం మాదే, మెజారిటీ డివిజన్లూ మావే అంటూ టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు అంచ‌నాల్లో మునిగి తేలుతున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు కాకినాడ కార్పొరేష‌న్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నానికి పూర్తి ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయి. కాకినాడ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. ప్రతిపక్ష వైసీపీ […]

కాకినాడ‌లో ఆ రెండు పార్టీల‌కు ఓటేస్తే మురిగిన‌ట్టేనా..!

అవును! ఇప్పుడు కాకినాడ ఓట‌ర్లు ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభ‌మైన కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక ఉద‌యం ఏడు గంటల నుంచి ప్ర‌శాంతంగా సాగిపోతోంది. ఓట‌ర్లు ఇక్క‌డ కూడా తండోప‌తండాలుగా పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌డుతున్నారు. మ‌హిళ‌లు ఇళ్ల‌లో ప‌నులను వాయిదా వేసుకుని మ‌రీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? త‌మ ఓటు విలువ లేకుండా పోతుంది? […]

నంద్యాల తొలి రౌండ్ లెక్కింపు ఓట్లు ఇవే

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ మ‌రి కొద్ది సేప‌ట్లో ప్రారంభంకానుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక‌లో మొత్తం 1.73 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. ఇక ముందుగా 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తారు. ఆ త‌ర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుంది. నంద్యాలలో తొలి రౌండ్ నంద్యాల రూరల్ మండలాన్ని లెక్కించనున్నారు. తర్వాత నంద్యాల పట్టణం ఓట్లను లెక్కిస్తారు. చివరగా ఉత్కంఠ రేపుతున్న గోస్పాడు మండలం ఓట్లను కౌంట్ చేస్తారు. తొలి మూడు రౌండ్లలో గ్రామీణ […]

నంద్యాల ఉప ఎన్నిక న‌గరా మోగింది

ఏపీతో పాటు తెలంగాణ‌లోను ఉత్కంఠ రేపుతోన్న ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నంద్యాల ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో టీడీపీలోకి జంప్ అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే […]

నంద్యాల ఎల‌క్ష‌న్ బ‌డ్జెట్‌ అన్ని కోట్లా!

ఎన్నిక‌లు వస్తే చాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పార్టీలు సామ‌బేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధార‌ణ ఎన్నిక అయినా, స‌ర్పంచ్ ఎన్నిక అయినా.. ధ‌న ప్ర‌వాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండ‌దు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి! గెలుపు కోసం అటు అధికార ప‌క్షం, ఇటు ప్రతిప‌క్షం పోటీపోటీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యం లో.. ఈ ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు ఎంత‌వుతుంద‌నే సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో నోట్ల క‌ట్ట‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా […]

పార్టీలు రెడీ… నంద్యాల నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..!

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జ‌రుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేష‌న్ రాకుండానే ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్ప‌టికే రెండు పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేశాయి. టీడీపీ అభ్య‌ర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు కాగా వైసీపీ అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు. చంద్ర‌బాబు అయితే ఇప్ప‌టికే […]

మూడు సార్లు లేని టెన్ష‌న్‌..బాబుకు ఇప్పుడెందుకో..!

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు అనుక్ష‌ణం తెగ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం నంద్యాల ఉప ఎన్నిక‌! ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి ఎలాంటి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. బాబు మాత్రం అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ రాజ‌ధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్క‌డే ఉంటూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌న్న‌మాట‌. అయిన‌ప్ప‌టికీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు మాత్రం అంత‌వీజీ కాద‌ని ఇంటిలిజెన్స్ […]

నంద్యాల‌లో మారిన వైసీపీ వ్యూహం

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీ ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇక్క‌డ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు సైకిలెక్కిన ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందే గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. భూమా మృతి త‌ర్వాత జ‌గ‌న్ ఇది వైసీపీ సీటు…ఇక్క‌డ వైసీపీ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో […]