” మన శంకర్ వరప్రసాద్ గారు ” మ్యాటర్ లో ఆ మ్యాజిక్ మిస్ చేస్తున్న అనిల్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను రూపొందించిన తర్వాత.. ఆ సినిమాకు మార్కెటింగ్ ఏ రేంజ్ లో చేయాలని విషయంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి తెలిసినంతగా ఏ డైరెక్టర్‌కు తెలియదు.. ఇక ఆయన తర్వాత అంతలా తన సినిమాను మార్కెటింగ్ చేస్తూ.. ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ క్రియేట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే.. ఆయన గత సంక్రాంతికి రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిందో తెలిసిందే. దాదాపు.. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ అరుదైన ఫీట్‌ను దక్కించుకుంది.

Venkatesh - Anil Ravipudi Film Titled As Sankranthiki Vasthunam |  cinejosh.com

ఇక సినిమా ఆరేంజ్‌లో ఆడియన్స్‌కు రీచ్ అవ్వడానికి కచ్చితంగా ప్రమోషన్సే ప్రధాన కారణం. సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచి అని ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రేండ్‌ క్రియేట్ చేశాడు. అదే ట్రెండ్‌ను ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఫాలో అవుతున్నారు. కానీ.. ఆయనకు వర్కౌట్ అయిన రేంజ్ లో ఎవరికి వర్కౌట్ కావట్లేదు. ఇతర దర్శకుల సంగ‌తేమో కానీ.. ఇప్పుడు అనిల్ రావిపూడి కి కూడా అది వర్కౌట్ కావడం లేదనిపిస్తుంది. మెగాస్టార్‌తో ఆయన రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుక జనవరి 12న ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్‌కు 16 రోజులు మిగిలినా.. ఇప్పటివరకు కనీసం మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు సరికదా.. టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి.

Anil Ravipudi: I always try to convey some values even in entertainer movies

ఇక సినిమాలో.. మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటే ఇప్పటివరకు కేవలం రెండు సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. థ‌ర్డ్‌ సాంగ్ చిరు, వెంకటేష్ కాంబోలో.. మెగా, విక్టరీ మాస్ సాంగ్‌గా రిలీజ్ చేయనున్నారు. అది కూడా కేవలం ప్రోమోను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామని తాజాగా పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ కాకుండా మరోసారి ట్రైలర్ కూడా రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ ప్రమోషన్స్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఈ క్ర‌మంలోనే మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని.. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో అనిల్ రావిపూడి ఆ హడావిడిలో ప్రమోషన్స్ పై కాన్సెంట్రేట్ చేయలేకపోతున్నాడని సమాచారం. మరొక పక్క ప్రమోషనల్ కంటెంట్ ను కూడా రిలీజ్ చేస్తే సమయం దొరకడం లేదట. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం మ్యాజిక్ ప్రమోషన్స్ విషయంలో.. మన శంకర వర ప్రసాద్ గారికి రిపీట్ చేయలేకపోతున్నాడు అనిల్. ఇక ఇలాగే కొనసాగితే మాత్రం కచ్చితంగా సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.