” రాజాసాబ్ ” ఓటీటీ డీల్ చాలా తక్కువా.. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్షన్ ఇదే..!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో మోస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. వ‌చ్చే సంక్రాంతి బరిలో జనవరి 9న వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను ఈ సినిమా పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ఆడియ‌న్స్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఓటీటీ డీల్ క్లోజ్‌ అయిపోయిందని.. నాన్‌థియేట్రికల్ బిజినెస్ లు కూడా కంప్లీట్‌ అయ్యాయని టాక్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిపై తాజాగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు.

తాజగా ఓ పాడ్‌ కాస్ట్‌లో ది రాజాసాబ్‌ నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌పై ఆయన రియాక్ట్ అవుతూ.. నెల రోజుల క్రితమే ఓటీటీ డీల్‌ కన్ఫర్మ్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. మేము అనుకున్నంత కలెక్షన్స్ కాలేదని చెప్పుకొచ్చాడు. మేము ఊహించిన దానికంటే తక్కువ వసూళ్లే వచ్చాయని.. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఇలానే పనిచేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ మొదట ఇంటర్నేషనల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ.. ఎవరు ఊహించిన విధంగా జియో హాట్‌స్టార్ రాజాసాబ్‌ హక్కులను కొనుగోలు చేసింది.

పాన్ ఇండియా భాషలతో కలిపి రూ.170 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. మేము అనుకున్నంత బిజినెస్ జరగలేదని.. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ చెప్పడంతో.. దీనికంటే తక్కువే జరిగిందా.. లేదా ఎక్కువ జరిగిందా.. అనే అంశంపై సందిగ్ధత మొదలైంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగిందని అనుకున్న.. థియేట్రిక‌ల్‌ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు కన్ఫామ్ అని.. కలెక్షన్‌ల వర్షం కురుస్తుందంటూ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.