టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2 తాండవంలో.. బాలయ్య కూతురుగా జనని రోల్‌లో నటించిన హర్షాలి మల్హోత్ర ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో హైలైట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందం, అమాయకత్వంతో అందరినీ ఫిదా మేసిన ఈ ముద్దుగుమ్మ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది. బజరంగీ భాయిజాన్ సినిమాలో చిన్న పాప అందరికి గుర్తుండే ఉంటుంది.. అమాయక నవ్వుతో మాయ చేసిన ఈ అమ్మడు ఒక్క సినిమాతో ఆల్ ఇండియన్ ఫేవరెట్ కిడ్‌గా అయ్యిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తో అఖండ 2 తాండవంలో మరోసారి మెరిసి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఈ అమ్మడు తాజాగా మాట్లాడుతూ.. నటిగా మంచి సినిమాలు చేస్తూ గొప్ప స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా తాను మాట్లాడుతూ.. అనుకోకుండా నాకు బజరంగీ భాయిజాన్ లో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా ఓవర్ నైట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నన్ను మార్చేసింది. ఇక పెద్దయ్యేకొద్దీ నాకు సినిమాలపై ఇష్టం పెరిగిందంటూ చెప్పుకొచ్చింది. బిగ్ స్క్రీన్ పై సెలబ్రిటీస్‌ను చూస్తూ నేను అలా కనిపించాలని అనుకునేదాన్ని. ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని అసలు ఊహించలేదంటూ చెప్పుకొచ్చింది. నాకు కథక్ పై కూడా పట్టు ఉంది. చదువుకుంటూనే కొన్ని సీరియల్స్ లోను యాక్ట్ చేశా.
బజరంగీ భాయిజాన్ టైంలో నేను చాలా చిన్న పిల్లని.. నా పాత్రకు మాటల్లేవు, వినికిడి శక్తి కూడా ఉండదు.. అలాంటి ఛాలెంజింగ్ రోల్ దొరకడం నా అదృష్టమనే చెప్పాలి అంటూ వివరించింది. అప్పట్లో నా డౌట్లు చాలానే ఉండేవి. ఆ సినిమా డైరెక్టర్ కబిర్ సార్, హీరో సల్మాన్ ఖాన్ సార్ చాలా ఓపిక నాకు అన్ని విషయాలు వివరించేవారు. కొన్ని అర్థమయ్యేవి.. కొన్ని అర్థం కాలేదు.. అయినా అన్ని అర్థం అయిపోయినట్లు తల ఊపేసే దాన్ని. నటిగా నా లైఫ్ ఇప్పుడే మొదలైంది. మంచి మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నా. రెగ్యులర్ రోల్స్ కాదు.. కాస్త డిఫరెంట్ పాత్రలను సెలెక్ట్ చేసుకుంటా. ఛాలెంజింగ్ పాత్రలో చేసినప్పుడే కదా ఆడియన్స్‌లో గుర్తుండిపోతాం.

ఇక నేను నటన కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు.. నా జీన్స్ లోనే నటన ఉందేమో.. డైరెక్టర్ సన్నివేశం చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వింటా.. నాకు ఎన్నో సందేహాలు వస్తాయి. వాటన్నిటిని నిర్మొహమాటంగా అడిగేస్తా.. ఈ సీన్‌కు ముందు సన్నివేశం ఏంటి.. తర్వాత ఏంటి ఇవన్నీ తెలుసుకుంటా. ఆ పాత్రకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా.. దాన్ని దృష్టిలో పెట్టుకొని నటిస్తా అంతే అంటూ వివరించింది. ఇక తెలుగులో బాలకృష్ణ సార్ నా ఫేవరెట్. అల్లు అర్జున్, ప్రభాస్ అన్న ఇష్టం. రాజమౌళి గారు, సంజెయ్ లీలా భన్సాలీ నా ఫేవరెట్ దర్శకులు.. వాళ్ళతో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదలను అంటూ చెప్పుకొచ్చింది.

