రాజమౌళి – అల్లు అర్జున్ కాంబో స్టోరీ ఇదే.. రచయిత

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలను నెలకొంటాయి. కేవలం టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి జక్కన్న.. తన కెరీర్‌లో ఇప్పటివరకు బన్నీతో ఒక్క సినిమాను కూడా తీయ‌లేదు. గతంలో.. వీళ్ళ కాంబోలో ప్రాజెక్ట్ రాబోతుందని టాక్ వినిపించినా.. అది నిజం కాదని వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో వారణాసి సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

RRR writer V Vijayendra Prasad: 'I steal stories from everywhere' | Telugu  News - The Indian Express

తాజా సమాచారం ప్రకారం.. వారణాసి కంప్లీట్ అయిన తర్వాత.. జక్కన్న బన్నీతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ తన సన్నిహితలతో వెల్లడించినట్లు సమాచారం. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాల్లో బన్నీ ఒక అడవి మనిషిగా కనిపించనున్నాడని.. 1980 నాటి స్టోరీని ఆధారంగా తీసుకొని.. ఈ మూవీ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్‌తో చేస్తున్న వారణాసిని.. పాన్ వరల్డ్ టార్గెట్ చేసి రిలీజ్‌కు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా సినిమా అని తెలియడంతో.. అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

Allu Arjun expresses his desire to work with SS Rajamouli

మరి అంచనాలకు తగ్గట్టుగా జక్కన్న స్ట్రాంగ్ కంటెంట్‌ ఎంచుకుని నిలబడతాడా.. లేదా చూడాలి. ఇక.. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్‌లో ఓ బడా ప్రాజెక్ట్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత.. జక్కన్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేయనున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. విజయేంద్రప్రసాద్ సైతం ఈ కథను ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాసుకున్నాడట. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ప్రాపర్గా రివీల్ చేయలేకపోతున్నారని.. ప్రస్తుతం రాజమౌళి వారణాసి పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా పై అయినా ఫోకస్ పెట్టనున్నాడట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని నిజంగానే జక్కన్న, బన్నీ కాంబోలో సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశానికి అంటుతాయి అనడంలో సందేహం లేదు. మరి వారణాసి తర్వాత వీళ్ళిద్దరి ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.