బూల్లితర బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో సీజన్ ముగియనుంది. ఈ క్రమంలోనే.. ఆడియన్స్‌లో విన్నింగ్ రేస్‌లో ట్రోఫీ ఎవరందుకోబోతున్నారని ఆసక్తి మొదలైంది. గత కొన్ని సీజన్లుగా ఊహించిన సక్సెస్ అందుకొని బిగ్ బాస్.. నాలుగవ సీజన్ తర్వాత.. మళ్లీ ఈ సీజన్ తో టిఆర్పి ని అంతకంతకు పెంచుకుంటూ పోయింది. ఫ్యామిలీ బాండ్స్, ఎమోషన్స్ అన్నింటిని కొనసాగిస్తూ మేకర్స్ కూడా.. స్వతంత్రత కంటే.. సపోర్టింగ్ టాస్క్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి డ్రామాను పీక్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ సీజన్ కు బ్రహ్మరధం పట్టారు. దీంతో.. ప్రతివారం 10 టిఆర్పి నమోదయింది.
ఇక టిఆర్పి సంగతి పక్కన పెడితే.. ప్రజెంట్ విన్నింగ్ రేస్‌లో తనుజ, కళ్యాణ్, డిమోన్‌ల మధ్యన టఫ్ కాంపిటీషన్ మొదలైంది. ఈ ముగ్గురిలో.. ఆదివారం ట్రోఫి ఎవరు అందుకోబోతున్నారని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంతేకాదు.. ఈ సీజన్‌లో స్పెషల్ గెస్ట్‌గా ఎవరు హాజరు కాబోతున్నారని సందేహాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. సీజన్ ఈ రేంజ్‌లో హిట్ కావడంతో.. స్పెషల్ గెస్ట్‌గా దానికి తగ్గ రేంజ్‌లో ఓ పాన్ ఇండియన్ స్టార్‌ను రంగంలోకి దింపబోతున్నారని సమాచారం. మొదట.. మెగాస్టార్ చిరంజీవి అనే టాక్ వినిపించినా.. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఫైనల్ కోచ్ విజేతలకు ట్రోఫీ అందించాడు.
మళ్ళీ.. చిరునే వస్తే రొటీన్ గా ఆడియన్స్ భావిస్తారనే ఉద్దేశంతో.. ఈసారి గ్రాండ్ ఫినాలను అంతకుమించి పోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట బిగ్ బాస్. ఈసారి రంగంలోకి రెబల్ స్టార్ ప్రభాస్ దిగనున్నాడని సమాచారం. ప్రభాస్ నుంచి సంక్రాంతి బరిలో జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. రాజాసాబ్ ప్రమోషన్స్ అంటూ ప్రభాస్ ను కన్విన్స్ చేసి బిగ్ బాస్ స్టేజ్ పైకి రప్పించాలని.. విన్నర్ కు ఆయన చేతి మీద ట్రోఫీ అందించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రభాస్ బిగ్ బాస్ స్టేజ్ పై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అసలే బ్లాక్ బస్టర్ సీజన్ కావడంతో.. టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడతారని విషయాల్లో నరాలు తెగేంత ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రభాస్ నిజంగానే ఈ సీజన్ స్పెషల్ గెస్ట్‌గా వస్తే మాత్రం టిఆర్పి రేటింగ్స్ లో బ్లాస్ట్ జరుగుతుందనడంలో సందేహం లేదు. మరి.. ఆదివారం ఏం జరగబోతుందో.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.



