విష్ణు ‘ కన్నప్ప ‘ డే 1 ఓపెనింగ్స్ సెన్సేషనల్ రికార్డ్.. ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే..?

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో మంచు విష్ణు హీరోగా.. తెర‌కెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని స్ట్రాంగ్ కలెక్షన్లు కొల్లగొడుతుంది. సినిమా రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే మూవీ రిలీజై పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత హైప్‌ పెరిగింది. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు, సినిమా బడ్జెట్, ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రెమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై కన్నప్ప సినిమాను మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక.. ఈ సినిమాకు విష్ణు కథ‌, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. నటీనటులు సాంకేతిక నిపుణులు, ప్రమోషన్ కార్యక్రమాలు అన్నిటిని కలుపుకొని దాదాపు సినిమాకు రూ.120 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. కన్నప్పలో సొంతంగా రిలీజ్ చేయాలని సంచలనం డెసిషన్ తీసుకున్న మంచు విష్ణు ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్లలో కన్న‌ప్ప‌ను రిలీజ్ చేశారు.

ఇక కన్నప్ప బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్లు, రూ.150 కోట్ల గ్రస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కన్నప్ప సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లో 1,15000 వేల టికెట్లు అమ్ముడుపోయాయని మంచు విష్ణు స్వయంగా వెల్లడించాడు. జూన్ 27 మార్నింగ్ షో నుంచి కన్నప్ప సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. బుకింగ్స్ మరింతగా జోరు అందుకున్నాయి. మధ్యాహ్నం 3:00 వరకు తెలుగులో 50.55%, తమిళ్లో 11.52, హిందీలో 4.83% మాత్రమే ఆక్యుఫెన్సీ నమోదైనట్లు సాక్ నిల్క్‌ వెల్లడించిన తర్వాత మరింత ఆక్యుపెన్సి పెరిగిందట.

చెన్నైలో 63, హైదరాబాద్ లో 388, బెంగళూరులో 310, విశాఖలో 133, విజయవాడలో 75, ఢిల్లీలో 106, ముంబైలో 86, త్రివేండ్రంలో 81 షోల లెక్కన కన్న‌ప్ప‌ను టెలికాస్ట్ చేశారు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కన్నప్పకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ లెవెల్ లో కలెక్షన్లు వచ్చాయి. గురువారం సాయంత్రం నాటికి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా రూ.1.05 కోట్లు రాగా.. 37% అక్యుపెన్సీ నమోదయింది. ఇక ఇండియన్ వైడ్‌గా.. అడ్వాన్స్ సేల్స్ కింద 4.53 కోట్లను రాబట్టినట్లు సినీ డిస్కో, బుక్ మై షోలు వెల్లడించాయి. కన్నప్ప ఆంధ్ర, నైజాంలో మొదటి రోజు రూ.8కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.16 కోట్ల వరకు ఓపెనింగ్ వచ్చే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వర్గాలు వెళ్లలించాయి. మరి మంచు విష్ణు మ్యాజిక్ వర్కౌట్ అయిందా.. లేదా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్షన్లు వచ్చాయో తెలియాలంటే అనౌన్స్మెంట్ వ‌చ్చే వరకు వేచి చూడాల్సిందే.