ప్రపంచవ్యాప్తంగా ” కన్నప్ప “.. డే వన్ వసూళ్ల ప్రొడక్షన్ లెక్కలు ఇవే..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో న‌టించిన లేటెస్ట్ మైథ‌లాజిక‌ల్ మూవీ క‌న్న‌ప్ప. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్, కాజ‌ల్ త‌దిత‌రులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను అవి ప్రొడ‌క్ష‌న్స్‌, 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌తిష్ట‌త్మ‌కంగా రూపొందించాడు మోహ‌న్ బాబు. ఇక అనౌన్స్‌మెంట్ అప్ప‌టినుంచే ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న క‌న్న‌ప్ప తాజాగా రిలీజై పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ ల భారీ హైప్ నెల‌కొంది. సినిమా ఇప్ప‌టికే చూసిన చాలామంది ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ గా మాట్లాడుతూ.. సినిమా బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ సైతం థియేటర్‌లో సినిమా చూసి చూసేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. కాగా ఇప్ప‌టికే క‌న్న‌ప్ప.. విష్ణు కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపినింగ్స్ ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే క‌న్న‌ప్ప కు ఫ‌స్ట్ డే.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ క‌లెక్ష‌న్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని ట్రేడ్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇక ఇప్ప‌టికే క‌న్న‌ప్పకు వ‌చ్చిన టాక్‌తో క‌న్న‌ప్ప ఫ‌స్ట్ డే దాదాపు రూ. 16 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉంద‌ట‌. అయితే కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వ‌చ్చినా.. ఎవరికి తగ్గట్లుగా వాళ్లు స్టోరీ రచించినా.. క్లైమాక్స్ మాత్రం అన్ని సినిమాల్లో ఒకే విధంగా ఉంటుంది. కాగా.. ప్రస్తుతం మంచు విష్ణు నటించిన కన్నప్ప మాత్రం.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. ఆడియ‌న్స్ గూస్ బంప్స్ కాయం అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మంచు విష్ణు న‌ట‌న‌పై ప్ర‌సంస‌లు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌న్న‌ప్ప డే 1 క‌లెక్ష‌న్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో.. ట్రేడ్ వ‌ర్గాల ప్రిడిక్ష‌న్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.