విష్ణు ” కన్నప్ప ” కు మనోజ్ షాకింగ్ రివ్యూ..!

గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్య డైలాగ్‌కు సెటైరిక‌ల్ కౌంటర్లు కూడా వేశాడు మ‌నోజ్‌. అంతేకాదు.. తాజాగా కన్న‌ప్ప రిలీజ్ ముందు.. విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. సినిమా కోసం మా నాన్నగారు.. ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమ, అంకితభావంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ మనోజ్ రాసుకొచ్చాడు.

అంతేకాదు మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియాన, అవ్రామ్‌లు వెండితెరపై మంచి జ్ఞాపకాలను పంచుకొనుండటం.. చూడడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ మనోజ్ పేర్కొన్నాడు. తనికెళ్ల భరణి గారి జీవితకాల క‌ల‌.. రేపు నెరవేరనుంది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. సినిమాల్లో నటించిన స్టార్ కాస్టింగ్‌కు సైతం కృతజ్ఞతలు తెలియజేసిన మ‌నోజ్‌.. మంచి హృదయం ఉన్న ప్రభాస్ గారికి, దిగ్గజ నటుడు మోహన్ లాల్‌ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభుదేవా గారికి ..ఈ సినిమాను ప్రేమతో నమ్మకంతో ఆదరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. మీరందరూ వెండితెరిపై మెరవడం చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.

అన్న‌ట్లుగానే.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన కన్నప్ప సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్‌లో సందడి చేశాడు. అంతేకాదు.. సినిమా చూసిన తర్వాత కన్నప్ప కు రివ్యూ కూడా ఇచ్చాడు విష్ణు. తను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుందని.. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. చివరి 20 నిమిషాలు సినిమా అయితే అదిరిపోయిందని.. ప్రభాస్ అన్న ఇంత బాగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా.. కొన్ని సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉన్నాయి. ఇక మా నాన్న మోహన్ బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ మంచు మనోజ్ చెప్పుకోచాడు. ప్రస్తుతం మనోజ్ ఇచ్చిన ఈ రివ్యూ తెగ వైరల్ గా మారుతుంది.