మెగాస్టార్ కోసం అనిల్ క్రేజీ ప్లాన్.. అదే నిజ‌మైతే బొమ్మ బ్లాక్ బస్టరే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బిజీ బిజీ లేనప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాలతో రాణిస్తున్న చిరు.. విశ్వంభ‌ర‌తో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇంకా ఈ మూవీ తెరపైకి రాకముందే సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రజెంట్ షెడ్యూల్ ముస్సెరిలో జరుగుతుంది. చిరంజీవితో పాటు కీలకతారాగణం అంతా ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.

Mega 157: Chiranjeevi-Anil Ravipudi's 'Mega 157' Commences Filming

ఇక ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. ఆమెతో పాటే.. మరో టాలీవుడ్ బ్యూటీ కేథరిన్ కూడా మేరవనున్నట్లు సమాచారం. ఇక.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఈ ఇద్దరు స్టార్ బ్యూటీస్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్‌గా మెర‌వ‌నున్నాడట. అయితే.. ఇప్పటికే సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇలాంటి క్రమంలో.. అనిల్ రావిపూడి.. చిరుకోసం మరో క్రేజీ ప్లాన్ వేసాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. చిరు కోసం.. మరో స్టార్ హీరోను రంగంలోకి దింపాడట అనిల్.

Mega 157': Chiranjeevi's next with Anil Ravipudi launched; Venkatesh  Daggubati sounds the clapboard - The Hindu

ఇంతకీ.. ఆ స్టార్ హీరో ఎవరు కాదు.. విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీకి.. అనిల్ రావిపూడి ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు సినిమాల్లో స్పెషల్ రోల్ కోసం అనిల్.. వెంకీని సంప్రదించగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో వెంకి రోల్‌కు చాలా స్పెషలిటీ ఉందని.. త్వరలోనే ఆయన ఈ సెట్‌లో సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు నెలరోజుల కాల్ షీట్లు వెంకి అనిల్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలై నెలాకరుకు ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన షూట్ ప్రారంభమవుతుందట. నిజంగా మెగా 157 లో వెంకటేష్ కూడా నటిస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ దగ్గుబాటి, మెగా అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.