నాని టాలీవుడ్‌కి పరిచయం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే.. ఎంతమంది ఉన్నారంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత నటుడిగా అవకాశాన్ని కొట్టేశాడు. మొదటి సినిమాతోనే పక్కింటి కుర్రాడిన నాచురల్ నటనతో ఆకట్టుకున్న నాని.. తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమా విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్.. అలాగే స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నటుడిగానే కాకుండా.. నిర్మాతగాను సత్తా చాటుతున్న నాని.. తన సినీ కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇంతకీ నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Ala Modalaindi (2011) - IMDb

నిత్యామీనన్
నాని పరిచయం చేసిన హీరోయిన్లు మొదటి నిత్య ఈన‌న్‌ పేరు వినిపిస్తుంది. అలా మొదలైంది సినిమాతో నిత్యమీనన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నాని.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో నిత్యమీనన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది.

Yevade Subramanyam (2015) | Nani ,Vijay Deverakonda,Malvika Nair,Nag Ashwin  |Full Movie Facts&Review - YouTube

మాళవిక నాయర్:
2017లో నాని హీరోగా.. నాగ అశ్విన్‌ డైరెక్ట్‌చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో అందాల భామ మాళవిక నాయర్‌ టాలీవుడ్‌కు పరిచయం అయింది.

Krishna Gaadi Veera Prema Gaadha (2016) - IMDb

మెహరీన్ ఫిర్జాదా:
నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో 2016లో మెహరీన్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

Gentleman (2016 film) - Wikipedia

నివేద థామస్:
ఇక 2016 లోనే నాని నటించిన మరో మూవీ జెంటిల్మెన్. ఈ సినిమాతో మలయాళం ముద్దుగుమ్మ నివేద థామస్ టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది.

Nani's Majnu Oye Meghamla Song Promo | Nani | Anu Emmanuel | Priya Shri |  TFPC - YouTube

అను ఇమ్మాన్యుల్:
2016 లోనే నాని నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ మజ్ను ‘ సినిమాతో అను ఇమ్మాన్యేల్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అలా నాని ఒకే ఏడాదిలో ముగ్గురు ముద్దుగుమ్మలను టాలీవుడ్ కు పరిచయం చేశాడు.

Watch Nani's Gang Leader | Prime Video

ప్రియాంక అరుళ్ మోహన్:
2019లో రిలీజ్ అయిన నాని.. ‘ గ్యాంగ్ లీడర్ ‘ మూవీతో ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Jersey movie review: Nani, Shraddha Srinath film is a rewarding story of  triumph and self discovery - Hindustan Times

శ్రద్ధ శ్రీనాథ్:
2019లోనే క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన మూవీ జెర్సి. ఈ సినిమాల్లో నాని ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయమైంది.

Ante Sundaraniki - Wikipedia

నజ్రియా నజీమ్:
నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో మలయాళ స్టార్ నటి నజ్రియా నజీమ్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Nani and Priyadarshi's Court Movie: Who is Sridevi Apalla?

శ్రీదేవి:
ఇక నాని నిర్మాతగా మారిన తర్వాత.. కోర్ట్ సినిమాతో యంగ్ బ్యూటీ శ్రీదేవిని టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేశాడు.