వెంకీ మామ బర్త్డే స్పెషల్.. ” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ సింగిల్ ప్రోమో..

తెలుగు సినీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 14న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Venkatesh's Sankranthiki Vasthunnam joins Sankranthi race | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ క్ర‌మంలో సినిమాపై ఆడియ‌న్స్‌లో ఆసక్తిని నేలకొంది. కాగా.. ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. గోదారి గట్టు సాంగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ సాధించింది. ఇప్పుడు మూవీ టీం తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సెకండ్ సింగల్ ప్రోమోను రిలీజ్ చేశారు. వెంకీ మామ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ.. మూవీ టీం ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Sankranthiki Vasthunam First Single: Vintage Venkatesh Chartbuster

ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీ దీన.. పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా.. అంటూ సాగే ఈ పాట‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ ప్రోమో ఎండ్‌ అయ్యేసరికి వెంకటేష్‌కు బర్త్‌ డే విష‌స్‌ తెలుపుతూ.. హ్యాపీ బర్త్డే వెంకటేష్ అని రాసి ఉంచారు. ఇక ప్రోమోలో వెంకటేష్ పోలీస్ లుక్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంది.