చరణ్ ” గేమ్ ఛేంజర్ ” స‌ర్ప్రైజ్‌.. రన్ టైం ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటి వారి సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ, అంజ‌లీ హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా సినిమా రన్ టైం పై ఓ సాలిడ్‌ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ మొత్తం 162 నిమిషాలు నడివితో రిలీజ్ కానుందని సమాచారం. ఈ విషయాన్ని యూకెలో సినిమా ప్రదర్శించనున్న డిస్ట్రిబ్యూటర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో నా గేమ్ ఛేంజ‌ర్ 2 గంటల 42 నిమిషాలు థియేటర్లలో సందడి చేయనుందని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థ‌మన్ సంగీతం అందించ‌గా దిల్ రాజు, ఆదిత్య రామ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

Always Ram Charan (Konidela) 🔵 | The 'GAMECHANGER' - JARAGANDI JARAGANDI  Song Poster Design ❤️‍🔥✨😎 !! Do follow and support @akki_ramcharan ❤️  #RamCharan... | Instagram

కాగా ఈ సినిమా నడివి ఇటీవ‌ల‌ వ‌స్తున్న సినిమాలన్నింటి నడివితో పోలిస్తే.. చాలా లిమిట్ గా ఉండడంతో.. ఇది సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. శంకర్, చరణ్ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.