టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. సుకుమార్ డైరెక్షన్‌లో తాజాగా పుష్ప 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ.. యాక్షన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక తాజాగా పలు ప్రదేశాలలో సక్సెస్ మీట్ లో కూడా బన్నీ పాల్గొని సందడి చేశాడు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడంటూ ఓ న్యూస్ సంచలనంగా మారింది.
పుష్ప 2 రిలీజ్ డేట్ కంటే ముందు రోజు.. రాత్రి 9:30 గంటల నుంచి బెనిఫిట్ షో లు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ హైదరాబాద్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో చూసేందుకు కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. ఇక ఆయనను చూసేందుకు జనాలు ఏగబడటంతో సంధ్య థియేటర్స్ వద్ద తొక్కిసులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడం సంచలనం సృష్టిస్తుంది.
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని పోలీస్ స్టేషన్కు రావాలని బన్నీని అడిగారు. దీంతో ఆయన పోలీసులకు సహకరించి వారితో పాటు వెళ్లడానికి ఒప్పుకున్నాడు. అయితే వెంటనే అల్లు అరవింద్ కూడా తమతో పాటు వెళ్లాలని చూడగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. ఇక భార్య స్నేహారెడ్డికి.. అల్లు అర్జున్ ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇక కేసులో ముందు ముందు ఏం జరగనుందో అనే భయం అభిమానుల్లో మొదలైంది. అల్లు అర్జున్ కు ఎలాంటి సమస్య రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ముందు ముందు ఈ కేస్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.