గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న న్యూస్ మంచు వారి ఫ్యామిలీ వివాదం ఎక్కడ చూసినా ఈ వార్తల వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మీడియా కూడా వారి వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లగా.. మోహన్ బాబు వారిపై చేయి చేసుకోవడంతో ఈ వార్తలు మరింత దుమారంగా మారాయి. అంతే కాదు.. ఇప్పటికే మోహన్ బాబు పై, విష్ణు, మనోజులపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్ల కోసం చేస్తున్న హై డ్రామా ఇది.. మీడియాలో హాట్ టాపిక్ గా మారాలని చూస్తున్నారంటూ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మోహన్ బాబు పై కేసు ఫైల్ చేశారు. ఇలా గత నాలుగు రోజుల నుంచి ఎన్నో వార్తలు వినిపిస్తున్న క్రమంలో.. మోహన్ బాబు కష్టార్జితంతో కట్టుకున్న జల్లపల్లిలోని ఇల్లు పైనే అందరి కన్ను ఉందని సమాచారం.
ఈ క్రమంలోనే మనోజ్ ఆ ఇంటిని తనకే రాసివ్వాలని గొడవ చేయడంతో.. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం బజారుకెక్కింది. ఇలా ఆస్తి తగాదాలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా మోహన్ బాబు వీలునామా ఇదే అంటూ ఓ నోట్ వైరల్ గా మారుతుంది. అంతే కాదు మోహన్ బాబు ఆస్తులు పంచడంలో చాలా విభేదాలు చూపించాడు అంటూ.. మనోజ్‌కు బాగా అన్యాయం జరిగిందంటూ తెలుస్తుంది. మోహన్ బాబు తన సంపాదించిన ఆస్తిలో మంచు విష్ణుకి శ్రీలక్ష్మి పిక్చర్ తో పాటు.. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ సంస్థలను రాసి ఇచ్చేసాడట. ఇక మంచు లక్ష్మికి కొన్ని స్థిరచరాస్తులతో పాటు.. ఫిలింనగర్ లో ఉన్న లగ్జరీ ఇల్లు రాసిచ్చినట్లు తెలుస్తుంది. మనోజ్ కి మాత్రం మీరిద్దరి కంటే అతి తక్కువ ఆస్తులు ఇచ్చారని.. కేవలం ఆయనకు హైదరాబాద్ శివారులో ఉన్న ఒక్క ఇల్లును మాత్రమే ఇచ్చారని ఆ విలునామాలో రాసి ఉంది.
దీంతో ఆస్తి విషయంలో తండ్రి తనకు అన్యాయం చేశాడని మనోజ్.. జర్లపల్లి లోని మోహన్ బాబు ఉంటున్న నివాసాన్ని కూడా తన పేరుపై రాసి ఇవ్వాలని కొద్ది రోజులుగా విభాగానికి దిగాడట. కానీ.. మోహన్ బాబు మాత్రం నేను చనిపోయేంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఈ ఇల్లు నేను ఎవరి పేరున రాయనంటూ తాగేసి చెప్పేసాడట. దీంతో అక్కకు , అన్నయ్యకు ఆస్తులు ఎక్కువగా ఇచ్చి నాకు ఆస్తి ఇవ్వకపోగా.. తప్పుడు కేసులు నాపై పెడుతున్నారు అంటూ మనోజ్ తిరగబడి ఇంటి వద్ద రచ్చ రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే మంచు వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీలునామని చూసిన వారంతా మనోజ్ కు చాలా అన్యాయం జరిగిందని.. ఆస్తి విషయంలో మోహన్ బాబు ఆయనకు చాలా అన్యాయం చేశాడంటూ.. అందుకే ఈ గొడవలు జరుగుతున్నాయంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.